
I wrote this poem in the year 2000 in those earlier days after I left India for US. I missed my family and friends terribly.
For my friends, who gave me a special place in their hearts..
సంవత్సరాల క్రింద కుదిరిన పరిచయాలు - ముదిరిన స్నేహాలై
జ్ఞాపకాల ఉప్పెన లో మనసుని తడుపుతుంటే
ప్రేమ లో తడిచిన నా మనసు పై ..ఎటు చూసినా నీ కాలిగురుతులే.......
రాళ్ళు ఉన్నాయి ..ముత్యపు చిప్పలు ఉన్నాయి
ఏది తీసి చూసినా తీపి గురుతులే
కాని నా హృదయం పై నీ అడుగులన్నీ, సముద్రం వైపు నడిచి ఉన్నాయి
చూస్తూ..చూస్తూ సంద్రం లో కలిసిపోతున్నాయి
నీ అడుగుల వెంట రావాలంటే, రాలేకున్నాను
నిన్ను చేరాలంటే చేరలేకున్నాను
జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటే
పరుగెత్తి పరుగెత్తి అలసిపోయాను
ఆ బాధ లో కన్నీరు..నా కళ్ళకి తెరలా ....
కన్నీరు తుడుచుకుని, సంద్రాన్ని చూస్తే
అప్పుడు తెలిసింది - అది 'కాలం' అని
నేను ఎంత పరుగెత్చినా, అప్పటి నిన్ను నేను ఎప్పుడూ చేరుకోలేనని .....
ఎంత దూరం లో నున్నా, నువ్వు తిరిగి చూసినప్పుడు
స్నేహమనే తీపి జ్ఞాపకాలతో నీను ఈ తీరం లో నీ కోసం వేచి ఉంటాను
నన్ను చేరాలంటే ఆ తీరాన నిలిచి కళ్లు మూసుకో
నేను అలనై వచ్చి నీ పాదాలను ప్రేమతో తడిపిపోతాను .........
Feels too emotional and silly in a way when I read this after a whole 8/9 years. But the love for my friends from that time is still all the same.
No comments:
Post a Comment